: సల్మాన్ 'ప్రేమ్ రతన్...'కు అద్భుతమైన కలెక్షన్లు... రెండు రోజులకే రూ.71 కోట్లు వసూలు


దర్శకుడు సూరజ్ బర్జాత్యాతో చాలా ఏళ్ల తరువాత నటుడు సల్మాన్ ఖాన్ చేసిన చిత్రం 'ప్రేమ్ రతన్ ధన్ పాయో'. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన వసూళ్లు రాబడుతోంది. మొదటి రెండు రోజుల్లోనే 71 కోట్లకుపైగా వసూళ్లు వచ్చాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో ఈ చిత్రం వసూళ్లను వివరించారు. విడుదలైన మొదటిరోజు రూ.40.35 కోట్లు, రెండు రోజు రూ.31.03 కోట్లు వచ్చాయి. రెండు రోజులకు కలిపి ఒక్క హిందీ వర్షెన్ కే రూ.71.38 కోట్లు వసూలయ్యాయి. ఈ క్రమంలో నేడు (శనివారం) రాబట్టే కలెక్షన్లతో వంద కోట్ల క్లబ్బులో ఇది చేరుతుందని చెబుతున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా కూడా విడుదలైన ఈ సినిమా తొలిరోజు బాగానే వసూలు చేసింది. యూఎస్ఏ-కెనడాలో 405,100 డాలర్లు, యూకెలో 290, 717 డాలర్లు, యూఏఈ-జీసీసీలో 654, 130 డాలర్లు, ఆస్ట్రేలియాలో 62,558, ఆర్ఓడబ్ల్యూ (మిగిలిన దేశాలు) 192,408 డాలర్లు వచ్చాయి. మొత్తం రూ.10.62 కోట్ల వరకు రాబట్టిందని తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. అయితే సల్మాన్ నటించిన 'కిక్' (రూ.26.40 కోట్లు), 'భజరంగీ భాయ్ జాన్' (రూ.27.25 కోట్లు) చిత్రాల మొదటిరోజు వసూళ్ల కంటే... ప్రస్తుతం 'ప్రేమ్ రతన్...' రెండోరోజు (రూ.31.03కోట్లు) అంతకుమించి వసూలు చేసిందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News