: ఇక మీదట పారిస్ ఎంత మాత్రం ప్రశాంతంగా ఉండబోదు: ఐఎస్ఐఎస్ ప్రకటన
ఇక మీదట పారిస్ ఎంత మాత్రం ప్రశాంతంగా ఉండబోదని హెచ్చరిస్తూ ఐఎస్ఐఎస్ వీడియో సందేశం విడుదల చేసింది. ఫ్రాన్స్ లో నరమేధానికి పాల్పడింది తామేనని ఐఎస్ఐఎస్ ప్రకటిస్తూ ఈ హెచ్చరిక జారీ చేసింది. ఫ్రాన్స్ పై బాంబు దాడులు చేస్తూనే ఉంటామని ఐఎస్ఐఎస్ స్పష్టం చేసింది. ఈ వీడియోను ఎప్పుడు? ఎక్కడ? తీశామన్న విషయాన్ని వెల్లడించాలని తాము భావించడం లేదని ఐఎస్ఐఎస్ పేర్కొంది. ఐసిస్ ప్రచార విభాగం అల్ హయత్ మీడియా సెంటర్ నుంచి ఈ వీడియో విడుదలైంది. కాగా, గత రాత్రి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో అమాయకులు హతులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు పారిస్ లో అదనంగా 1500 మంది పోలీసులను మోహరించారు.