: పారిస్ ఘటనలో సోషల్ మీడియా బాధ్యత అద్భుతం


ఉగ్రదాడులతో ఫ్యాషన్ నగరం పారిస్ భీతిల్లింది. ఉగ్రవాదులు విరుచుకుపడుతున్న సందర్భంలో ముందు జాగ్రత్తగా ఫ్రాన్స్ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. దీంతో, ప్రజలు క్షణాల్లో రోడ్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఈ హఠాత్పరిణామంతో పారిస్ పౌరులకు ఏం చేయాలో, ఎటు వెళ్లాలో తెలియలేదు. ఎక్కడ భద్రత లభిస్తుందో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో పారిస్ పౌరులు స్పందించారు. ముందుగా పర్షియన్లు స్పందిస్తూ, 'దూరం వెళ్లాల్సిన వారు ఆందోళన చెందాల్సిన పని లేదు. మా ఇంట్లో ఓ ఐదుగురికి చోటుంది, రండి, మా ఆతిథ్యం స్వీకరించి వెళ్లండి, ఎలాంటి ఆందోళన అవసరం లేదు' అంటూ ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రాంలలో పోస్టు చేశారు. అంతే, దాంతో ఇతర పారిస్ పౌరుల్లో చైతన్యం రగిలింది. ఒకరి తరువాత ఒకరుగా 'మేమున్నాం' అంటూ ఆపన్నహస్తం చాచారు. 'ఇక్కడికి దగ్గర్లోనే గురుద్వారా ఖల్సా ఉంది, అది ఉన్నదే ప్రజల రక్షణ కోసం, అక్కడికి వెళ్లండి' అంటూ కొందరు; 'మా ఇంట్లో చోటుంది రండి, మేం ఇద్దరికి ఆతిథ్యం ఇవ్వగలం' అంటూ మరికొందరు ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. సాధారణంగా ఇలాంటి సమాయాల్లో ఉగ్రవాదులపై మాటల తూటాలతో విరుచుకుపడతారు. కానీ నెటిజన్లు విజ్ఞతతో వ్యవహరించారు. విద్వేషాల జోలికెళ్లకుండా, ప్రేమను పంచారు. ఫేస్ బుక్ కూడా సేఫ్టీ చెక్ పేరుతో 'మీ బంధువులు ఎక్కడున్నారో గుర్తించండి, వారి క్షేమ సమాచారం తెలుసుకోండి, వారు క్షేమంగా ఉన్నట్టు నిర్ధారణ అయితే సేఫ్ గా ఉన్నట్టు మార్క్ చేయండి' అంటూ ఓ ఫీచర్ ను పారిస్ వాసులకు అందుబాటులోకి తెచ్చింది. అలాగే కాల్పులు జరుగుతున్న పరిసరాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? వంటి విషయాలను విశేషంగా షేర్ చేశారు.

  • Loading...

More Telugu News