: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఎంపీ గుత్తా అభ్యంతరం


తెలంగాణ రాష్ట్రంలో పలు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటుచేసి ముందుకెళుతోంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు సమంజసం కాదని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఆయన లేఖ రాశారు. ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాల్సిందే అని నిర్ణయం తీసుకుంటే... 17 లోక్ సభ నియోజకవర్గాలను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ అంశాన్ని పరిశీలించాలని సీఎస్ కు గుత్తా విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News