: క్షేమంగానే ఉన్నా!.... ప్యారిస్ పర్యటనలో ఉన్న టాలీవుడ్ నటుడు నందూ ప్రకటన


ఐఎస్ ఉగ్రవాదులు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ పై జరిపిన భీకరదాడి తెలుగు చిత్రసీమ టాలీవుడ్ ను ఆందోళనలోకి నెట్టింది. ఈ నెల ప్రారంభంలోనే ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రముఖ నటి, దర్శకురాలు రేణు దేశాయ్ నిన్న రాత్రే ప్యారిస్ నుంచి వచ్చేశారు. అయితే నిన్న రాత్రి హైదరాబాదు నుంచి బయలుదేరిన టాలీవుడ్ యువ నటుడు, గాయని గీతామాధురి భర్త నందూ నేటి ఉదయం ఫ్రాన్స్ నగరం ఫ్రాంక్ ఫర్ట్ చేరుకున్నాడు. మరికాసేపట్లో ప్యారిస్ వెళ్లాల్సి ఉండగా అతడికి ఉగ్రవాద దాడుల గురించి తెలిసింది. దీంతో ప్యారిస్ ప్రయాణాన్ని విరమించుకున్న నందూ ఫ్రాంక్ ఫర్ట్ లోని తన మిత్రుడి వద్దే ఉండిపోయాడు. దాడులపై స్పందిస్తూనే తాను క్షేమంగా ఉన్నానని అతడు ప్రకటించాడు. ‘‘నేను క్షేమంగానే ఉన్నాను. ఫ్రాంక్ ఫర్ట్ లో ఉండగా ప్యారిస్ దాడుల విషయం తెలిసింది. ఆ దాడులు భయానకం. ఈ నేపథ్యంలో ప్యారిస్ వెళ్లే యోచనను విరమించుకున్నాను. ఫ్రాంక్ ఫర్ట్ లో ఉన్న మిత్రుడి వద్దకు వెళ్లాను’’ అని అతడు ఐఏఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీకి తెలిపాడు.

  • Loading...

More Telugu News