: పారిస్ ఉగ్రదాడి బాధితుల్లో భారతీయులెవరూ లేరట
పారిస్ లో జరిగిన ఉగ్రదాడి బాధితుల్లో ఇప్పటివరకు భారతీయులు ఎవరూ లేరని డిప్యూటీ చీఫ్ మిషన్ ఇన్ ఫ్రాన్స్ మనీష్ ప్రభాత్ తెలిపారు. కొంతమంది సాయం కోసం తమకు ఫోన్ చేశారని వారికి తాము సహాయం అందించామని అన్నారు. పారిస్ లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. సమాచారం, సహాయం కోసం 0033140507070 నంబర్ కు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు. మరోవైపు పారిస్ ఘటనపై పలు దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. దాడిలో మృతులకు సంతాప సూచకంగా చైనాలోని ఫ్రాన్స్ దౌత్య కార్యాలయం ప్రాంగణంలో ఫ్రాన్స్ జాతీయ జెండాను సగం వరకు దించారు. కెనడియన్ ప్రావిన్స్ లోని అల్బెర్టాలో కాల్ గరీ టవర్స్ ని ఫ్రెంచ్ జాతీయ జెండా రంగులను పోలిన విధంగా విద్యుద్దీపాలతో వెలిగించి మృతులకు నివాళులర్పించారు.