: ఏపీలో పదవీ విరమణ పొందే ఉద్యోగుల గ్రాట్యుటీ పెంపు


పదవీ విరమణ పొందే ఉద్యోగుల గ్రాట్యుటీ గరిష్ఠ పరిమితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచింది. రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్టు తెలిపింది. 10వ వేతన సవరణ సంఘం సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంటూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి జీవో విడుదల చేశారు. ఉత్తర్వులు జారీ చేసిన రోజు నుంచే ఈ ప్రయోజనం అమల్లోకి వస్తుందని తెలిపారు. 2071 హెడ్ ఆఫ్ అకౌంట్ కింద పింఛను ప్రయోజనాలు పొందే రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉద్యోగులందరికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని వివరించారు.

  • Loading...

More Telugu News