: ఆ హోటల్ లో సాంబారు వదిలేస్తే రూ. 13 ఫైన్ కట్టాల్సిందే!
మీరు చదివింది నిజమే. అక్కడ సాంబారు కాని, రసం కాని వేస్ట్ చేస్తే రూ. 13 రూపాయలు వసూలు చేస్తారు. ముంబైలోని ఉడిపి ఇడ్లీ హౌస్ లో ఈ రూల్ పెట్టారు. కందిపప్పు ధర ఆకాశాన్ని అంటడంతో ఇడ్లీ హౌస్ యాజమాన్యం తీవ్రంగా ఆలోచించింది. ధరలను పెంచితే కస్టమర్లు దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో, వినూత్నంగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చింది. సాంబారు, రసం వేస్ట్ చేస్తే రూ. 13 చెల్లించాలని ప్రతి టేబుల్ పై నోటీసు ఉంచింది. అయితే, ఈ నిర్ణయం కస్టమర్లను కూడా ఆకట్టుకుంటోంది. రేట్లను పెంచకుండా, వృథాను అరికట్టడానికి సరైన నిర్ణయం తీసుకున్నారని కస్టమర్లు అంటున్నారు. అవసరమైనంత మేరకు సాంబారు, రసం వేయించుకుంటున్నారు. తన ప్లాన్ సక్సెస్ కావడంతో మేనేజ్ మెంట్ కూడా సంతోషంగా ఉంది.