: నెహ్రూ ప్రతిష్టను దిగజార్చే కుట్ర జరుగుతోంది: జైపాల్ రెడ్డి
అధికారంలో ఉన్న ఏ ప్రధాని అయినా దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మార్గంలోనే పయనించాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి సూచించారు. నెహ్రూ సిద్ధాంతాలు దేశానికి శ్రీరామ రక్ష అని చెప్పారు. అయితే, నెహ్రూ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రస్తుతం కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. నెహ్రూ బొమ్మ, ప్రస్తావన లేకుండా బాలల దినోత్సవాన్ని ఆరెస్సెస్ నిర్వహించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పేరుతో ఆరెస్సెస్ రాజ్యమేలుతోందని మండిపడ్డారు. నవభారత నిర్మాణానికి నెహ్రూనే ఆద్యుడని... ఆయన స్ఫూర్తిని విస్మరిస్తే దేశానికి మంచిది కాదని చెప్పారు.