: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా... ఆమోదించిన గవర్నర్


బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ కు తన రాజీనామాను ఈ ఉదయం సమర్పించారు. ఈ క్రమంలో బీహార్ అసెంబ్లీని రద్దు చేయాలని రాష్ట్ర కేబినెట్ సిఫారసు చేసింది. "నితీశ్ కుమార్ రాజీనామా చేసి గవర్నర్ కు సమర్పించారు. ఇదే సమయంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ కు తెలియజేశారు" అని ఓ అధికారి తెలిపారు. ఆ వెంటనే నితీశ్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. అయితే, రాష్ట్రంలో మళ్లీ కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని నితీశ్ ను కోరారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో త్వరలో నితీశ్ ను ఆర్జేడీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా కూటమి ఎన్నుకోనుంది. ఈ నెల 20న మరోసారి సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు.

  • Loading...

More Telugu News