: తిరుమల బాట పట్టిన ఏపీ మంత్రులు, ప్రముఖులు
తిరుపతిలో రెండు రోజుల పాటు టీడీపీ దిశా-నిర్దేశ కార్యక్రమం జరుగుతుండటంతో అక్కడికి వచ్చిన మంత్రులు, టీడీపీ నేతలంతా తిరుమల బాట పట్టారు. వారితో పాటు ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బాబాసాహెబ్ భోస్లే, కేంద్ర మంత్రి సుజనా చౌదరి స్వామివారిని దర్శించుకున్నారు. ఏపీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, కొల్లు రవీంద్ర, మృణాలిని, దేవినేని ఉమా, ఎంపీలు కేశినేని నాని, మాగంటి బాబు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. టీడీడీ అధికారులు వారందరికీ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తరువాత వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.