: ప్యారిస్ పై ఐఎస్ఐఎస్ దాడికి ఫ్రాన్స్ అధ్యక్షుడే కారణమట!
ఫ్రాన్స్ పై ఉగ్రదాడికి తామే కారణమని ఐఎస్ఐఎస్ ప్రకటించుకుంది. అయితే, ఈ దాడికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. కానీ, నరమేధం సృష్టించిన ఉగ్రవాదుల మాటలను విన్న ఓ ప్రత్యక్ష సాక్షి దాడి వెనుక గల కారణాన్ని వెల్లడించాడు. ముష్కరుల మాటలను తాను స్పష్టంగా విన్నానని ఓ రేడియో ప్రజెంటర్ అయిన పియర్రే జనాస్జక్ తెలిపాడు. "ఈ తప్పంతా మీ అధ్యక్షుడు హోలాండ్ దే. సిరియా విషయంలో అతను జోక్యం చేసుకుని ఉండకూడదు" అని ఉగ్రవాదులు అన్నారని చెప్పాడు. ఇరాక్ గురించి కూడా వారు మాట్లాడారని తెలిపాడు.