: కరీంనగర్ ఏఎస్ఐ వడ్డీ కేసులో డీఎస్పీలపై వేటు


కరీనంగర్ ఏఎస్ఐ మోహనరెడ్డి వడ్డీ దందా కేసులో ఇద్దరు డీఎస్పీలపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. కొత్తగూడెం డీఎస్సీ భాస్కర్ రావు, హుజురాబాద్ డీఎస్పీ సంజీవ్ కుమార్ లను బదిలీ చేసింది. వారిని డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఇదే కేసులో నిన్న (శుక్రవారం) కరీంనగర్ అదనపు ఎస్పీ జనార్దనరెడ్డిని కూడా బదిలీ చేశారు. అంతేగాక ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొంతమంది పోలీసు అధికారులపై చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. అటు అసలు సూత్రధారి మోహనరెడ్డిని మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని సీఐడీ అదికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News