: ఈ మెగా హీరోకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం అట!
కెరియర్ బిగినింగ్ లోనే ప్రేక్షకుల ఆదరణ పొందిన మెగా హీరో వరుణ్ తేజ్. తన నటనతో అభిమానులను అలరిస్తున్న వరుణ్... సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలో, ట్విట్టర్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు వరుణ్ సమాధానాలిచ్చాడు. మెగా ఫ్యామిలీలో మీకు నచ్చిన డ్యాన్సర్ ఎవరు? అనే ప్రశ్నకు... మెగాస్టార్ చిరంజీవి అని సమాధానమిచ్చాడు. చిరంజీవి తర్వాత అన్నయ్య రామ్ చరణే బెస్ట్ డ్యాన్సర్ అని తెలిపాడు. మెగా హీరోలు కాకుండా మీకు బాగా నచ్చే హీరో ఎవరు? అనే ప్రశ్నకు... ప్రభాస్ అని సమాధానమిచ్చాడు. ప్రభాస్ లుక్, యాక్టింగ్ సూపర్బ్ అని చెప్పాడు. ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపాడు. ఈ సమాధానంతో ప్రభాస్ అభిమానులను కూడా ఆకర్షించే ప్రయత్నం చేశాడు.