: తెలంగాణ పోలీసు శాఖలో మరో లంచగొండి!...కూకట్ పల్లి ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడి
తెలంగాణ పోలీసు శాఖలో మరో లంచావతారం వెలుగులోకి వచ్చింది. కూకట్ పల్లి ఏసీపీగా పనిచేస్తున్న సంజీవరావు అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదుల నేపథ్యంలో అనినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆయన ఇంటిపై నేటి తెల్లవారుజామున దాడి చేశారు. ఆల్వాల్ లోని సంజీవరావు ఇల్లు సహా మొత్తం ఐదు ప్రాంతాల్లో ప్రస్తుతం ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా సంజీవరావు ఇంటిలో రూ.2 కోట్ల మేర అక్రమాస్తులు బయటపడినట్లు సమాచారం. సోదాల్లో భాగంగా సంజీవరావు ఇంటిలో భారీ ఎత్తున నగదు, నగలు, ఆస్తి పత్రాలు లభించినట్లు తెలుస్తోంది. నగరంలోని శివారు ప్రాంతం శామీర్ పేటతో పాటు వరంగల్ లోనూ ఆయన పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.