: ప్రధాని కావాలన్న ఆశే లేదు.. వేరే పనులున్నాయి: చిదంబరం
తనకు ప్రధాని అవ్వాలన్న కోరికేమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేయాలనుకుంటున్నానని చెప్పారు. ఢిల్లీలో ఒక సదస్సులో పాల్గొన్న చిదంబరాన్ని.. 2014 ఎన్నికల తర్వాత ప్రధాని అయితే ఆర్థిక మంత్రిగా ఎవరిని ఎంపిక చేసుకుంటారు? అని మీడియా వాళ్లు గడుసరిగా ప్రశ్నించారు. దీనికి మేథావి చిదంబరం అంతే తెలివిగా సమాధానం ఇచ్చారు.
నాకు అలాంటి ఊహలేం లేవు. అలాంటి కోరికలు కూడా లేవని చిదంబరం చెప్పారు. 'మరికొన్ని సంవత్సరాలు నాకోసమే నేనులా ఉండాలనుకుంటున్నా'నని, 'నాకంటూ కొన్ని వేరే పనులున్నా'యని చిదంబరం చెప్పారు. ''మీ ప్రశ్నలో మొదటి దాన్ని నేను ఖండించినప్పుడు ఇక రెండో దానికి తావెక్కడిది?'' అని చిదంబరం ఎదురు ప్రశ్నించారు.