: ఆ నరమేధం మా పనే!... ఐఎస్ ఉగ్రవాదుల ప్రకటన


సుందర నగరం ప్యారిస్ ను రక్తసిక్తంగా మార్చిన దాడి తమ పనేనని ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)’ ఉగ్రవాదులు ప్రకటించారు. ప్యారిస్ స్థానిక కాలమాన ప్రకారం నిన్న రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో నగరంలో మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఆరు చోట్ల అత్యాధునిక తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులకు దిగిన ఉగ్రవాదులు మరో మూడు చోట్ల శక్తిమంతమైన బాంబులను పేల్చారు. ఈ దాడుల్లో ఇప్పటిదాకా 170 మందికి పైగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తమ పనేనని కొద్దిసేపటి క్రితం ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించారు. గతంలో ప్యారిస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మీడియా సంస్థ ‘చార్లీ హెబ్డో’ కార్యాలయంపైనా ఐఎస్ ఉగ్రవాదులు దాడి చేసి 17 మందిని పొట్టనబెట్టుకున్నారు. తాజాగా అదే నగరంపై విరుచుకుపడ్డ ఐఎస్ ముష్కరులు ఏకంగా 170 మందిని బలిగొన్నారు.

  • Loading...

More Telugu News