: పవన్ కల్యాణ్ టూర్ పై వైఎస్సార్సీపీ నేతల విమర్శలపై కామినేని ఆగ్రహం
వైఎస్సార్సీపీ నేతలు లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యేందుకు ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారని వైఎస్సార్సీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ కంటే మెరుగ్గా పవన్ కల్యాణ్ పోరాడుతున్నారని ఆయన తెలిపారు. ఏదో ఒక ఆరోపణ చేయడం వైఎస్సార్సీపీ నేతలకు అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పవన్ కల్యాణ్ బాధ్యతాయుతంగా స్పందిస్తున్నారని ఆయన తెలిపారు.