: మోదీకి బాసటగా ఒమర్ అబ్దుల్లా... ప్రధాని ప్రసంగంపై ప్రశంసలు!
ప్రధాని నరేంద్ర మోదీకి జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మద్దతు పలికారు. ఎంతసేపూ ప్రధానిని విమర్శించడం కాదని ఆయన స్పష్టం చేశారు. బ్రిటిష్ పార్లమెంటునుద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగం అద్భుతమని ఆయన ప్రశంసించారు. అలాంటి ప్రసంగం విన్నప్పుడు ప్రతి భారతీయుడు గర్విస్తాడని, అలాంటప్పుడు ఆయనను అభినందించాల్సిందేనని ఆయన చెప్పారు. ఎంత సేపూ ఆయనను విమర్శించడం కాదని, ఇలాంటప్పుడు అభినందించాలని ఆయన సూచించారు. అలాగే గార్డియన్ విలేకరి అడిగిన ప్రశ్న ప్రధాని స్థాయి వ్యక్తిని అడిగిన ప్రశ్నగా తాను భావించడం లేదని ఆయన ట్విట్టర్ ద్వారా అభిప్రాయపడ్డారు.