: హర్యానా దున్నపోతు 'యువరాజ్'కు జ్వరం!


పంజాబ్, హర్యానాలతో బాటు, పలు ఉత్తరాది రాష్ట్రాల్లో నిర్వహించిన ఆల్ ఇండియా పోటీల్లో 12 సార్లు చాంపియన్, హైదరాబాద్ సదర్ సంబరాల్లో ఆకర్షణగా నిలిచిన 'యువరాజ్' అనే దున్నపోతుకు జ్వరమొచ్చింది. యాదవులందరూ కలిసి హైదరాబాద్ నగరంలో నిర్వహించే సదర్ పండగలో దున్నపోతుల ప్రదర్శన నిర్వహిస్తారు. అందుకోసమని, రెండు రోజుల క్రితం హర్యానా నుంచి ఈ ‘యువరాజు’ ను హైదరాబాద్ కు తీసుకొచ్చారు. దీనిని హర్యానాలోని కురుక్షేత్ర నుంచి ఇక్కడికి తీసుకువచ్చేందుకు ఆరు రోజులు పట్టింది. సుమారు రూ.3లక్షల వరకు ఖర్చు అయింది. ‘యువరాజ్’ యజమాని కరమ్ వీర్ సింగ్ మాట్లాడుతూ, 2007వ సంవత్సరంలో ఈ దున్నపోతు పుట్టింది. చాలా దూడలకు జన్మనిచ్చింది. ‘యువరాజ్’ బరువు 1600 కిలోలు, ఎత్తు 6 అడుగులు, 14 అడుగుల పొడవు. మహా దర్జాగా ఉండే దీనికి దానా, గడ్డితో పాటు రోజుకు 15 కిలోల యాపిల్స్ వరకు కావాలి. అంతేకాదు బాదం, పిస్తా, జీడిపప్పు కూడా లాగించేస్తుంది. దీనికి విదేశాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. ‘యువరాజ్’ వీర్యం కోసం యూరోపియన్ దేశాల్లో చాలా డిమాండ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్ లో ‘యువరాజ్’ విలువ రూ.7 కోట్లు’ ఉందని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News