: మాటలు అదిరిపోయాయి...ఏదో ఒకటి చెయ్యాలి!: మోదీపై రిషికపూర్ ప్రశంసలు


బ్రిటన్ పార్లమెంటును ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం అద్భుతమని, ఆయన చేసిన ప్రసంగానికి భారతీయుడుగా గర్విస్తున్నానని ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషికపూర్ తెలిపారు. ఢిల్లీ, బీహార్ ఎన్నికల ఫలితాలు పక్కన పెడితే, దేశానికి ఏదో ఒకటి చేసి చూపించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. కాగా, మూడు రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్ వెళ్లిన ప్రధాని అక్కడి పార్లమెంటును ఉద్దేశించి ఆసక్తికరమైన ప్రసంగం చేశారు. నేడు క్వీన్ ఎలిజబెత్ బకింగ్ హామ్ ప్యాలెస్ లో ఇచ్చిన విందులో పాల్గొన్న మోదీ, మరి కాసేపట్లో వెంబ్లే బహిరంగ సభలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

  • Loading...

More Telugu News