: మంత్రి కడియంకు ఎర్రబెల్లి సవాలు
వరంగల్ ఉప ఎన్నికలు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేల్చుతున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతలు విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఉపఎన్నికను రసవత్తరంగా మారుస్తున్నారు. టీడీపీ శక్తి యుక్తులపై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై టీడీపీ నేత ఎర్రబెల్లి మండిపడ్డారు. కడియం శ్రీహరికి చేతనైతే పదవికి రాజీనామా చేసి పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సూచించారు. తాను కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని, ఇద్దరం ఇండిపెండెంట్లుగా పోటీ చేసి ఎవరి సత్తా ఏంటో నిరూపించుకుందాం రావాలని సవాలు విసిరారు. పాలకుర్తిలో ఓటమి పాలైతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, నువ్వు ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా? అని సవాల్ చేశారు.