: వరంగల్ లో హరీశ్ రావును అడ్డుకున్న మైనారిటీలు


వరంగల్ ఉపఎన్నికలు అధికార పార్టీకి తీవ్ర తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ప్రచారం నిమిత్తం ఎక్కడికి వెళ్లినా స్థానికులు నేతలను నిలదీస్తూనే ఉన్నారు. తాజాగా తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లాలో మైనారిటీలు అడ్డుకున్నారు. ఉపఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న హరీశ్ రావు వరంగల్ లో మైనారిటీలను ఉద్దేశించి ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా, కొంత మంది ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ప్రభుత్వ పథకాలు తమకు అందడం లేదని ఆరోపించారు. తమ సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వారు మండిపడ్డారు. తమ సమస్యలు తీర్చాలని వారు డిమాండ్ చేశారు. దీంతో వరంగల్ స్థానిక నేత కొండా సురేఖ కల్పించుకుని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దీనిపై మండిపడ్డ వారు, తమ సమస్యలు పట్టనప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు.

  • Loading...

More Telugu News