: ఆక్సిజన్ ఆసుపత్రి వైద్యుడు రణ్ ధీర్ రెడ్డి ఇంటి వద్ద కీర్తి ధర్నా


సోషల్ మీడియా ద్వారా హైదరాబాదులోని యూసఫ్ గూడలో జవహర్ నగర్ కు చెందిన యువతికి గాలం వేసి, 9 నెలలు ప్రేమ నాటకమాడిన ఆక్సిజన్ ఆసుపత్రి వైద్యుడు రణ్ ధీర్ రెడ్డి ఇంటి ఎదుట బాధితురాలు కీర్తి ఆందోళన చేపట్టింది. నిన్న జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కీర్తి, పోలీసుల స్పందనపై నిరసనతో మహిళా సంఘాలను ఆశ్రయించింది. దీంతో నేడు మహిళా సంఘాల ఆధ్వర్యంలో రణ్ ధీర్ ఇంటి ఎదుట దేవరకొండలో ఆందోళన చేపట్టింది. కీర్తి, మహిళా సంఘాల రంగప్రవేశం గురించి ఉప్పందిన రణ్ ధీర్ రెడ్డి, కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని అక్కడే బైఠాయించింది.

  • Loading...

More Telugu News