: డయాబెటిక్ ల కిడ్నీలు, హార్ట్ ను పదిలంగా ఉంచే డైట్!


మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ డైట్ ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాలు, గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుందని కొత్త అధ్యయనంలో వెల్లడైంది. జపాన్ లోని షిగా యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్స్ కు చెందిన ప్రొఫెసర్ షిన్-ఇచి అరాకీ, ఆయన కొలీగ్స్ ఈ అధ్యయనం నిర్వహించారు. టైప్-2 డయాబెటిస్ రోగులకు మూత్రపిండాలు పాడవటంతో బాటు, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మూత్ర పిండాల పనితీరు సాధారణంగా ఉన్న టైప్-2 డయాబెటిస్ తో బాధపడుతున్న సుమారు 623 రోగులపై ఈ అధ్యయనం చేసింది. మూత్ర విసర్జన ద్వారా ఎక్కువ శాతం పొటాషియం పోతుండటం కారణంగా మూత్రపిండాల పనితీరు క్రమేపి నెమ్మదిస్తుందని, దీని కారణంగా కార్డియో వాస్క్యులర్ సమస్యలకు ఆస్కారం ఉంటుందన్న విషయం తమ అధ్యయనంలో స్పష్టమైందని వారు పేర్కొన్నారు. సోడియం స్థాయుల కారణంగా మూత్రపిండాలు, గుండె సంబంధిత వ్యాధులు సంభవించే అవకాశాలు లేవని వారి పరిశోధనలో తేలింది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో చాలా ముఖ్యమైనది ఆహారము. దీనికి సంబంధించి డైట్ ప్రణాళిక పక్కాగా ఉండాలని సూచించారు. డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. పొటాషియం ఎక్కువగా ఉండే మాంసాహారం విషయానికొస్తే... అన్ని రకాల మాంసం, చేపలు(కాడ్, సాల్మన్, ఫ్లౌండర్), చిన్న చేపలు(సముద్రంలో ఉండేవి) మొదలైన వాటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాగా, పొటాషియం ఎక్కువగా ఉండే శాకాహారం... టొమాటో, బఠాణి, కొన్ని రకాల ఆకు కూరలు, అరటి పండ్లు, కివీ, ఆప్రికోట్ వంటి పండ్లు, పాలలో పొటాషియం నిల్వలు అధికంగా ఉంటాయి.

  • Loading...

More Telugu News