: మరోసారి రూ. 26 వేల దిగువకు పుత్తడి
అంతర్జాతీయ విపణిలో నెలకొన్న పరిస్థితులతో బంగారం ధర మరోసారి అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం నాటి సెషన్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 300 తగ్గి రూ. 25,950కి చేరింది. ఆభరణాల వ్యాపారస్తులు, ట్రేడర్ల నుంచి కొనుగోలు మద్దతు తగ్గడమే ధరల పతనానికి కారణమని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ. 500 తగ్గి రూ. 34,400కు చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,080.40 డాలర్లకు తగ్గింది. సమీప భవిష్యత్తులో వీటి ధరలు మరింతగా తగ్గే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.