: కేన్సర్ చిన్నారులతో సందడి చేసిన రకుల్ ప్రీత్ సింగ్


టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో సందడి చేసింది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని అపోలో ఆసుపత్రి, క్యూర్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో రకుల్ ప్రీత్ పాల్గొంది. ఈ సందర్భంగా కేన్సర్ ను జయించిన చిన్నారులను అభినందించింది. ప్రాణాంతక వ్యాధితో పోరాడి విజయం సాధించిన చిన్నారులు సమాజంలో అందరికీ ఆదర్శప్రాయులని అభిప్రాయపడింది. ఆధునిక వైద్య పరిజ్ఞానంతో కేన్సర్ ను జయించవచ్చన్న సంగతి తెలియజెప్పేందుకు వీరే నిదర్శనమని రకుల్ పేర్కొంది. అనంతరం వారికి బహుమతులు అందజేసి, కాసేపు వారితో గడిపింది. వారిని ఇలా కలవడం ఎంతో సంతోషం కలిగించిందని రకుల్ తెలిపింది.

  • Loading...

More Telugu News