: హరీశ్ రావుకు ఎదురు సవాల్ విసిరిన జీవన్ రెడ్డి
వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే టీపీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారా? అని టీఎస్ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతే ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇప్పటికైనా ఫామ్ హౌస్ ను వదిలిపెట్టి రైతు సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ విజయం సాధించడం ఖాయమని చెప్పారు.