: యువీకి నిశ్చితార్థ శుభాకాంక్షలు తెలిపిన సానియా


క్రికెటర్ యువరాజ్ సింగ్, నటి హేజల్ కీచ్ లకు నిశ్చితార్థం జరిగిందన్న వార్తల నేపథ్యంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా యువీకి శుభాకాంక్షలు తెలిపింది. ఇండోనేషియాలోని బాలిలో వారిద్దరికీ ఎంగేజ్ మెంట్ జరిగిందంటూ నిన్న(గురువారం) వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయాన్ని ఎవరూ ధ్రువీకరించలేదు. కానీ నిశ్చితార్థానికి ముందు యువరాజ్, హెజెల్ లు ఫతేఘర్ లోని ఓ గురుద్వారాలో సంత్ రామ్ సింగ్ వద్ద ఆశీర్వాదం తీసుకుంటుండగా తీసిన ఫోటోను ఓ ఆంగ్ల దినప్రతిక ట్విట్టర్ లో పోస్టు చేసింది. దాన్ని యువీ అభిమానుల కోసం రీట్వీట్ చేశాడు. అంటే తమ నిశ్చితార్థం అయిందని చెప్పకనే చెప్పాడన్నమాట. ఈ నేపథ్యంలోనే సానియా "కంగ్రాచ్యులేషన్స్" అంటూ ట్వీట్ చేసింది.

  • Loading...

More Telugu News