: రేపటి మ్యాచ్ కి సఫారీల కీలక బౌలర్లు దూరం
సౌతాఫ్రికా ప్రధాన బలం బౌలింగ్...ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్ మన్ పని పట్టే బౌలింగ్ లైనప్ సౌతాఫ్రికా జట్టు సొంతం. అపారమైన బౌలింగ్ వనరులు కలిగిన సఫారీలకు టీమిండియాతో రెండో టెస్టు ప్రారంభానికి ముందే ఇద్దరు ఆటగాళ్లు దూరమయ్యారు. సఫారీల కీలక బౌలర్లు డేల్ స్టెయిన్, ఫిలాండర్ రెండో టెస్టులో ఆడడం లేదు. మొదటి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో గాయపడ్డ స్టెయిన్ ఫిట్ నెస్ నిరూపించుకోవడంలో విఫలం కాగా, ఫిలాండర్ చీల మండ గాయం నుంచి కోలుకోలేదు. దీంతో ఇద్దరు కీలక బౌలర్లు సౌతాఫ్రికాకు అందుబాటులో లేకుండాపోయారు. కాగా, ఇద్దరు బౌలర్లు అందుబాటులో లేని సఫారీల బౌలింగ్ కు మోర్నీ మోర్కెల్ నాయకత్వం వహించనున్నాడు. సౌతాఫ్రికా జట్టులో ఆల్ రౌండర్లు ఎక్కువ మంది, రిజర్వు ఆటగాళ్లలో మరో ఇద్దరు బౌలర్లు ఉండడంతో బౌలింగ్ విభాగం కొత్త రూపు సంతరించుకుంది.