: తెలంగాణకు పూర్తిస్థాయి డీజీపీగా అనురాగ్ శర్మ నియామకం
తెలంగాణ రాష్ట్ర డీజీపీగా అనురాగ్ శర్మ నియమితులయ్యారు. ప్రస్తుతం తాత్కాలిక డీజీపీగా ఉన్న ఆయనను పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల కిందట డీజీపీ ఎంపిక కోసం రాష్ట్రం పంపిన ఆరుగురి పేర్లను కేంద్ర ప్యానల్ పరిశీలించింది. చివరికి ముగ్గురి పేర్లతో తుది జాబితాను ఖరారుచేసి ఇటీవల రాష్ట్రానికి పంపింది. అందులో అనురాగ్ శర్మ, ఏకే ఖాన్, అరుణ బహుగుణ పేర్లు ఉన్నాయి. అందులో ఇంచార్జ్ డీజీపీగా ఉన్న శర్మ వైపే ప్రభుత్వం మొగ్గు చూపింది.