: ఓడిపోతే రాజీనామాకు సిద్ధమా?: ఉత్తమ్ కు హరీశ్ రావు సవాల్
వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారా? అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. 48 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంగిలి మెతుకుల కోసం రాష్ట్రాన్ని బలిచేశారని ఆరోపించారు. హాస్టల్లో చదువుకునే పిల్లలకు గ్రాముల లెక్కలో అన్నం పెట్టిన కక్కుర్తి కాంగ్రెస్ నేతలది అని విమర్శించారు. ఆంధ్ర నాయకుల పల్లకీలు మోసి, తెలంగాణ ప్రజలను పాడెక్కించిన ఘనత కాంగ్రెస్ ది అని మండిపడ్డారు. ప్రతి హామీని అమలు చేస్తున్న టీఆర్ఎస్ ను విమర్శించే అర్హత కాంగ్రెస్ కు లేదని అన్నారు. తెలంగాణకు సాగునీరు కూడా లేకుండా చేసిన ఘనత కాంగ్రెస్ నేతలదే అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.