: రఘువీరా చేపట్టింది మట్టియాత్ర కాదు ఒట్టియాత్ర: మాజీ మంత్రి ఆనం
ఏపీలో ప్రభుత్వం ఇటీవల చేపట్టిన మన నీరు- మన మట్టికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తలపెట్టిన మట్టి సత్యాగ్రహంపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి విమర్శలు చేశారు. రఘువీరా చేపట్టిన మట్టియాత్ర ఒట్టియాత్ర అని ఎద్దేవా చేశారు. ప్రజల్లో చైతన్యం లేకుండా ఎన్ని యాత్రలు చేపట్టినా వృథానే అని స్పష్టం చేశారు. నెల్లూరులో మీడియాతో ఆనం ఈ విధంగా మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలవడంపై ఆనం ఇదే సమయంలో స్పందించారు. అసలు చంద్రబాబును కలిసేందుకు ఎందుకు వెళ్లారో పవన్ కే తెలియదని హేళన చేశారు. ఏపీలో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆనం ఇప్పుడు రఘువీరాపై విమర్శలు చేయడం గమనార్హం.