: బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్... నలుగురు మావోల మృతి
ఛత్తీస్ గఢ్ లో మరోసారి మావోయిస్టులు, పోలీసు బలగాల మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా హల్లూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టుళు చనిపోయారు. వారిలో ఓ కమాండర్ స్థాయి వ్యక్తి కూడా ఉన్నాడు. ఎన్ కౌంటర్ జరిగిన ఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున మందుగుండు సామగ్రి, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.