: రాజయ్యకు ఒక న్యాయం... మీ కుటుంబానికి మరో న్యాయమా?: కేసీఆర్ పై నాగం ఫైర్
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఓ పనికిమాలిన ప్రభుత్వం ఉందంటూ మండిపడ్డారు. కేసీఆర్ పాలన అత్యంత దారుణంగా ఉందని ఆరోపించారు. ఇంతవరకు కరవు మండలాలను కూడా ప్రకటించనటువంటి మూర్ఖపు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. ప్రజల శాపం ఈ ప్రభుత్వానికి తగులుతుందని చెప్పారు. అవినీతి పేరుతో ఆనాటి ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్యకు అన్యాయం చేశారని, ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల అవినీతిని దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. రాజయ్యకు ఓ న్యాయం, మీ వారికి మరో న్యాయమా? అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామాను ఆమోదించడనికి ఎందుకు ఇంత లేట్? అని నిలదీశారు. ప్రాజెక్టులను రీడిజైన్ ఎందుకోసం చేస్తున్నారు? ఎవరికోసం చేస్తున్నారని ప్రశ్నించారు.