: కేసీఆర్ సర్కారుకు హైకోర్టు మొట్టికాయ!...ఐఏఎస్ క్వార్టర్ల కూల్చివేతపై స్టే
కొత్త రాష్ట్రం తెలంగాణలో మొట్టమొదటి సారి అధికార పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్ సర్కారుకు హైకోర్టులో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మొన్నటికి మొన్న పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థను రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. నిన్నటికి నిన్న ఏపీ మూలాలున్న విద్యుత్ సంస్థల ఉద్యోగుల తొలగింపు కూడా కుదరదని న్యాయస్థానం తీర్పు చెప్పింది. తాజాగా హైదరాబాదులోని ఐఏఎస్ అధికారుల క్వార్టర్ల కూల్చివేతకు కార్యరంగంలోకి దూకిన కేసీఆర్ సర్కారుకు హైకోర్టు బ్రేకులు వేసింది. తక్షణమే కూల్చివేతలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేస్తూ కొద్దిసేపటి క్రితం హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది.