: తమిళనాడు 'తమిళ నాయుడు'గా మారిన వేళ!


అదేంటి తమిళనాడు 'తమిళ నాయుడు'గా ఎప్పుడు మారిపోయిందని అనుకుంటున్నారా? వెంకయ్యనాయుడు నేతృత్వంలోని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులు అలా మార్చేశారు మరి. గతంలో తమిళనాడు చేసిన విజ్ఞప్తిపై పట్టణాభివృద్ధి శాఖ ఓ ప్రకటన జారీ చేయగా, అందులో తమిళనాడు అన్న పదాన్ని 'తమిళ నాయుడు' చేసేశారు. అమృత్ (అటల్ మిషన్ ఫర్ రిజువెంటేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ ఫార్మేషన్) కార్యక్రమంలో భాగంగా తమిళ సర్కారు ప్రతిపాదనలు పంపగా, దానిపై ఆ శాఖ స్పందించింది. అమృత్ పథకానికి సహకరిస్తామని చెబుతూనే 'తమిళ నాయుడు' అంటూ ప్రస్తావించడం కొత్త చర్చకు తెరలేపింది. అంతేలే ఆయన శాఖలోని అధికారులు రోజుకు వేల సార్లు 'naidu' అని రాస్తుంటారుగా. ఇక అలవాటైన చేతులు 'nadu' మధ్యలో 'i' చేర్చేస్తున్నాయి. కాగా, ఇటీవల వెంకయ్య నాయుడు తరచూ చెన్నైని సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణాదిలో బీజేపీ మూలాలు ఎంతమాత్రమూ కనిపించని తమిళనాడులో పార్టీని మరింతగా పటిష్టపరచాలని ఆయన భావిస్తూ, ఈ పర్యటనలు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే.

  • Loading...

More Telugu News