: అద్వానీని నేనెప్పుడూ అగౌరవపరచలేదు: నితిన్ గడ్కరీ
బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో సీనియర్ నేతలంతా ఒక్కసారిగా ప్రధాని మోదీ, అమిత్ షాలపై మండిపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారిద్దరికీ పార్టీ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మద్దతుగా నిలిచారు. బాధ్యతా రహితంగా ఎవరు మాట్లాడిన వారిపై చర్యలు తీసుకుంటామంటూ పలువిధాలుగా మాట్లాడారు. అయితే పార్టీ అగ్రనేత ఎల్ కే అద్వానీపైనే ఆయన ఇలా అంటున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ గడ్కరీ వాటిని ఖండిస్తూ తాజాగా వివరణ ఇచ్చారు. తానెప్పుడూ అద్వానీని అగౌరవపరచలేదని తెలిపారు. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరలేదన్నారు. పార్టీ సీనియర్ నేతలతో పార్టీ నాయకత్వం మాట్లాడుతుందని పేర్కొన్నారు.