: ఉమేష్ స్థానంలో ఇషాంత్... స్టెయిన్ డౌట్ ఫుల్?


భారత్-సౌత్ ఆఫ్రికాల మధ్య రేపటి నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో ఉమేష్ యాదవ్ స్థానంలో ఇషాంత్ శర్మ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇషాంత్ పై ఉన్న ఒక టెస్టు నిషేధం కూడా ముగిసింది. దీంతో, అతని రాకకు మార్గం సుగమమయింది. మరోవైపు, నెట్స్ లో ఇషాంత్ చెమటోడుస్తున్నాడు. దీంతో, కొత్త బంతిని ఇషాంత్, వరుణ్ అరోన్ లు పంచుకుంటారని విశ్వసనీయ సమాచారం. మరోవైపు సౌతాఫ్రికా స్పీడ్ స్టర్ స్టెయిన్ రెండో టెస్టులో ఆడే అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. తొలి టెస్టులో కండరాల నొప్పితో బాధపడిన స్టెయిన్ ఫిట్ నెస్ ను నిరూపించుకోవాల్సి ఉంది. స్టెయిన్ జట్టులో ఉంటాడా? లేదా? అనే విషయంపై కెప్టెన్ డీవిలియర్స్ కూడా అనుమానాస్పదంగానే సమాధానమిచ్చాడు. స్టెయిన్ తన ఫిట్ నెస్ ను నిరూపించుకోవాల్సి ఉంది... అందువల్ల అతను 100 శాతం ఆడతాడు అనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని తెలిపాడు.

  • Loading...

More Telugu News