: సూకీ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లభించింది: మయన్మార్ ఎన్నికల అధికారులు


మయన్మార్ పార్లమెంట్ ఎన్నికల్లో అంగ్ సాన్ సూకీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమెక్రసీ (ఎన్ఎల్ డీ) పార్టీ ఘన విజయం సాధించింది. చారిత్రాత్మక ఎన్నికల్లో సూకీ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు ప్రకటించిన 80 శాతం ఫలితాల్లో ఆమె పార్టీకి పూర్తి మెజారిటీ దక్కింది. ఈ క్రమంలో ఆ దేశ పార్లమెంట్ లో సూకీ పార్టీనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాంతో దేశాధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం కూడా ఎన్ఎల్ డీకి దక్కింది. ఓ విదేశీయుడిని పెళ్లి చేసుకోవడం వల్ల మయన్మార్ రాజ్యాంగం ప్రకారం సూకీ దేశాధ్యక్షురాలిగా అనర్హురాలన్న సంగతి తెలిసిందే. మయన్మార్ ఎగువ, దిగువ సభల్లో కలిపి ఇప్పటివరకు మొత్తం 348 స్థానాల్లో సూకీ పార్టీ దక్కించుకుందని ఆ దేశ ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం 664 సీట్లు ఉన్నాయి. వాటిలో ఏడు నియోజకవర్గాల్లో ఎన్నికలుజరగలేదు. దాంతో మెజారిటీ రావాలంటే 329 స్థానాలను దక్కించుకోవాలి. ఎన్ఎల్ డీ ఇప్పటికే 348 స్థానాల్ని దక్కించుకోవడంతో గెలుపు లాంఛనమయింది.

  • Loading...

More Telugu News