: చంద్రబాబుకు మాదిగల ఉసురు తప్పకుండా తగులుతుంది: మంద కృష్ణ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మండిపడ్డారు. 2014 ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్న చంద్రబాబు... ఎన్నికల తర్వాత తన విధానాన్ని మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్గీకరణపై మాట్లాడటానికి కూడా చంద్రబాబు ప్రయత్నించడం లేదని అన్నారు. ఈ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. మాదిగల ఉసురు చంద్రబాబుకు తప్పకుండా తగులుతుందని అన్నారు. ఈ రోజు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ, మంద కృష్ణ పైవ్యాఖ్యలు చేశారు.