: భర్త నుంచి విడాకులు పొందిన నటి రేవతి
అలనాటి అందాల నటి రేవతి ఎట్టకేలకు తన భర్త సురేష్ మీనన్ నుంచి విడాకులు పొందింది. చెన్నై ఫ్యామిలీ కోర్టు వీరికీ ఈరోజు విడాకులు మంజూరు చేసింది. దాంతో దాదాపు 27 సంవత్సరాల వీరి వివాహ బంధం నేటితో ముగిసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించిన రేవతి దర్శకురాలిగా కూడా నిరూపించుకున్నారు. 1986లో సినిమాటోగ్రాఫర్ సురేష్ మీనన్, రేవతిల మధ్య ఏర్పడిన పరిచయం పెళ్లికి దారి తీసింది. ఎంతో సంతోషంగా గడిచిన వీరి జీవితంలో కొన్ని కారణాల వల్ల ఘర్షణలు తలెత్తాయి. చివరికి ఇరువురు విడిపోయేందుకు నిర్ణయం తీసుకున్నారు.