: పాలన, పథకాల అమలులో కేసీఆర్ కు ఎవరూ సాటిరారు: హరీష్ రావు
వరంగల్ ఉపఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ఎన్నికకు ఇన్ చార్జ్ గా ఉన్న మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. వరంగల్ ఉప ఎన్నిక ఫలితం సీఎం కేసీఆర్ ప్రభుత్వ పనితీరుకు దిక్సూచి వంటిదన్నారు. పాలన, పథకాల అమలులో ఆయనకు ఎవరూ సాటిరారని పేర్కొన్నారు. మూడు సంవత్సరాల్లో రహదారులు, తాగు, సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హరీష్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ స్థాయిలో వరంగల్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు స్పష్టం చేశారు.