: నాడు అలిగిన వైకాపా నేతకు నేడు పెద్ద పదవి ఇచ్చిన జగన్!


నెల్లూరు జిల్లా వైకాపా జిల్లా బాధ్యతలు తనకు వద్దంటూ అలిగిన వైకాపా నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి మరింత పెద్ద పదవిని ఇచ్చారు ఆ పార్టీ నేత వైఎస్ జగన్. వైకాపా రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఆయనను నియమిస్తున్నట్టు పార్టీ ఈ ఉదయం ప్రకటించింది. రాష్ట్ర కమిటీలో క్రమశిక్షణా సంఘం సభ్యుడిగా యల్లసిరి గోపాల్ రెడ్డి పేరును కూడా చేర్చామని తెలిపింది. అధ్యక్షుడు జగన్ ఆదేశాలకు అనుగుణంగా ఈ నియామకాలు జరిగినట్టు తెలుస్తోంది. కాగా, గతంలో నల్లపురెడ్డి వైకాపాకు దూరమవుతున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కోవూరు మాజీ శాసనసభ్యుడిగా ఉన్న నల్లపురెడ్డికి, నెల్లూరు ఎంపీ మేకపాటికీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News