: పవన్ కల్యాణ్ సేవలు ఉపయోగించుకుని గెలుస్తాం: ఎల్.రమణ


వరంగల్ ఉపఎన్నికలో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. తమ ఉమ్మడి అభ్యర్థి విజయం కోసం బీజేపీ, టీడీపీలు భారీగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సేవలను ఉపయోగించుకుని ఉప ఎన్నికలో విజయం సాధిస్తామని చెప్పారు. ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి పూర్తి సహకారం అందిస్తున్నామనే విషయాన్ని తమ అధినేత చంద్రబాబుకు తెలియజేశామని రమణ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యాలే తమ ప్రచార అస్త్రాలని చెప్పారు. మరోవైపు, వరంగల్ లో తాను ప్రచారం చేసే విషయంపై పవన్ కల్యాణ్ ఇంతవరకు వ్యక్తిగతంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News