: ఐదు నెలల తరువాత వెలుగు చూసిన నిజం... పోయిన ప్రాణం సంగతేంటి?


అద్నాన్ గిల్కర్. వయసు 18 సంవత్సరాలు. శ్రీనగర్ లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఎప్పుడూ క్లాసులో ఫస్ట్. ఐదు నెలల క్రితం సెమిస్టర్ పరీక్షలు రాసినప్పుడు తప్పాడు. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని కన్నవారికి తీరని కడుపుకోతను మిగిల్చి వెళ్లిపోయాడు. అతని తల్లిదండ్రులు రీవాల్యుయేషన్ కోరితే, మార్కుల షీట్లో తప్పు దొర్లిందని, ఈసారి కూడా అతనే క్లాస్ ఫస్టని అధికారులు చెప్పడంతో వారు మరింత బాధతో కుమిలిపోతున్నారు. "మేము అతన్ని ఎక్కడ కనుగొనాలి? నీ రిజల్ట్స్ మారాయని, నువ్వే ఫస్టని ఎలా చెప్పాలి?" అని తనకు కనిపించిన వారందరినీ అద్నాన్ తండ్రి హిలాల్ అహ్మద్ గిల్కర్ ప్రశ్నిస్తుంటే చూసేవారి కళ్లవెంట నీళ్లు తిరుగుతున్నాయి. కాశ్మీర్ సర్కారు మాత్రం ఈ తప్పునకు సదరు కళాశాలదే బాధ్యతని, విధుల్లో అలసత్వం ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి తప్పించుకుంది. తనకు మార్కులు తక్కువ వచ్చాయని తెలుసుకున్న అద్నాన్ జూలై 18న జీలం నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనికి ఫిజిక్స్ లో నూటికి 96 మార్కులు వస్తే, మార్కుల షీట్లో 28 అని పడటమే దీనికంతటికీ కారణం. అధికారుల నిర్లక్ష్యం, కాస్తంత తొందరపాటుతో పోయిన ప్రాణం తిరిగొస్తుందా?

  • Loading...

More Telugu News