: మూడు రోజుల్లో 5 టన్నులకు పైగా బంగారం కొనేశారు!


కేవలం మూడు రోజుల వ్యవధిలో ఇండియాలో సోమవారం నాడు ధన త్రయోదశి నుంచి బుధవారం నాడు దీపావళి వరకూ, ఇండియాలో అధికారిక అంచనాల ప్రకారం అమ్ముడైన బంగారం ఎంతో తెలుసా? దాదాపు 5,300 కిలోలు. ఇక చిన్న చిన్న పట్టణాల్లోని వీధుల్లో ఉన్న అసంఘటిత రంగంలోని లెక్కలు దీనికి అదనం. ఈ సీజనులో బంగారం ధరలు తగ్గడం కూడా అమ్మకాలు గణనీయంగా పెరిగేట్టు చేసిందని, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో ఎక్కువ విక్రయాలు సాగాయని నిపుణులు వ్యాఖ్యానించారు. సాధారణ రోజులతో పోలిస్తే ఈ సీజనులో 25 శాతం వరకూ అమ్మకాలు పెరిగాయని తెలిపారు. 2013 లో దీపావళి నాడు గ్రాము బంగారం ధర రూ. 2,850గా ఉండగా, ఈ సంవత్సరం అది రూ. 2,450కి తగ్గింది. కాగా, ఈ సంవత్సరం రూ. 4,800 కోట్ల విలువైన బాణసంచా అమ్మకాలు సాగాయని, గతంతో పోలిస్తే ఇది తక్కువేనని శివకాశి వ్యాపార వర్గాలు వెల్లడించాయి. వర్షాలు పడటంతో వ్యాపారులు కొనుగోళ్లకు దూరమయ్యారని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News