: ఇకపై తిరుపతి చేరుకున్న తరువాత కూడా స్పెషల్ దర్శనం టికెట్లు కొనుక్కోవచ్చు!


మీరు తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావిస్తున్నారా? ఇంటర్నెట్ లో రూ. 300 ప్రత్యేక దర్శనం, మరేదైనా సేవా టికెట్లు లభించలేదా? డోంట్ వర్రీ. ఇకపై తిరుపతి చేరుకున్న తరువాత కూడా రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లను కొనుగోలు చేయవచ్చు. మీకు అదృష్టం తోడై భక్తుల సంఖ్య తక్కువగా ఉంటే, తిరుమలలో సేవా టికెట్లూ లభిస్తాయి కూడా. నేటి నుంచి తిరుపతిలో రూ. 300 దర్శన టికెట్లను విక్రయించేందుకు టీటీడీ నిర్ణయించింది. ఇప్పటివరకూ ఆన్ లైన్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ టికెట్లు ఇకపై తిరుపతిలో కొనుక్కోవచ్చు. ప్రస్తుతానికి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకూ, త్వరలోనే 24 గంటలూ రూ. 300 టికెట్ల విక్రయాలు జరుపుతామని అధికారులు ప్రకటించారు. ఆన్ లైన్లో 35 వేల టికెట్లను అందుబాటులో ఉంచుతుంటే, కొన్నిసార్లు కేవలం 20 వేల వరకూ మాత్రమే అమ్ముడవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తిరుమలలో వివిధ రకాల సేవా టికెట్ల అందుబాటును బట్టి, అవి పూర్తయ్యే వరకూ విక్రయిస్తామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News