: ప్రపంచ అగ్రశ్రేణి వ్యాపారవేత్తల జాబితాలో సత్తా చాటిన అజయ్ బంగా...సత్య నాదెళ్లకూ చోటు
ప్రపంచ అగ్రశ్రేణి వ్యాపారవేత్తల జాబితాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త అజయ్ పాల్ సింగ్ బంగా (అజయ్ బంగా) సత్తా చాటారు. ప్రస్తుతం మాస్టర్ కార్డ్ సీఈఓగా పనిచేస్తున్న అజయ్ బంగా ఫార్చ్యూన్ మేగజీన్ 50 మంది ప్రపంచ అగ్రశ్రేణి వ్యాపారవేత్తలతో నిన్న విడుదల చేసిన జాబితాలో ఐదో స్థానంలో నిలిచారు. ఇక ఈ జాబితాలో తెలుగు తేజం, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు 47వ స్థానం దక్కింది. కాగ్నిజెంట్ చీఫ్ ఫ్రాన్సిస్కో డిసౌజా కూడా సత్య నాదెళ్ల కంటే మెరుగైన స్థానం సాధించారు. జాబితాలో డిసౌజా 16వ స్థానంలో నిలిచారు. ఇక ఈ జాబితాలో ‘నైక్’ అధినేత మైక్ పార్కర్ అగ్రస్థానంలో నిలవగా, ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకెర్ బర్గ్ రెండో స్థానంలో నిలిచారు.