: మారిన విమాన లగేజీ నిబంధనలు... ఇక బాదుడే!
మీరు విమానాల్లో ప్రయాణిస్తుంటారా? హ్యాండ్ బ్యాగ్ మినహా చెకిన్ బ్యాగేజీ తీసుకెళ్తే అదనపు బాదుడు ఇక తప్పకపోవచ్చు. జీరో బ్యాగేజీ చార్జీ ఆఫర్లను కస్టమర్లకు దగ్గర చేసేందుకు ఎయిర్ లైన్స్ కంపెనీలకు డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అనుమతి ఇచ్చిన నేపథ్యంలో, అదనపు లగేజీతో వస్తే, దాని బరువును బట్టి జరిమానా చెల్లించక తప్పదు. ప్రస్తుతం ఎయిరిండియా 23 కేజీల వరకూ, మిగతా దేశీయ ప్రైవేట్ విమానయాన సంస్థలు 15 కేజీల వరకూ చెకిన్ బ్యాగేజ్‌కు ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదన్నది తెలిసిందే. చెకిన్ బ్యాగేజ్ తో వెళ్లకుండా ఉన్న వారికి రూ. 200 డిస్కౌంటు ఆఫర్ ను ఇప్పటికే స్పైస్ జెట్ అమలు చేస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా టికెట్ కొని, ఆపై చెకిన్ బ్యాగేజ్ తో వెళ్తే, 10 కేజీలకు రూ. 500, 15 కేజీలకు రూ. 750 చార్జీలు కట్టాల్సి ఉంటుంది. ఈ జరిమానా మొత్తం ఎయిర్ లైన్స్ సంస్థ విచక్షణపై ఆధారపడి వుంటుంది.